Tag » Garuda

Foreign Airlines Touch Down In The Philippines

ACCESSIBILITY to the Philippines, a longstanding challenge for tourism, is improving markedly owing to the unprecedented increase in foreign airlines flying into the country and new routes blazed this year. 214 more words

Airlines

Garuda Indonesia Travel Fair 2015

buat anda yang senang berburu tiket murah, jangan lewatkan kesempatan emas Garuda Indonesia Travel Fair 2015 yang diselenggarakan pada tanggal 3-5 April 2015 bertempat di Assembly Hall Jakarta Convention Centre. 232 more words

Promo

Indonesia: Diều hâu thần Garuda Pancasila

https://ssangnguyen.files.wordpress.com/2015/03/java-various-artists.mp3

Quốc huy của Indonesia được gọi là Garuda Pancasila, đó là sự kết hợp của hình tượng thần chim Garuda và diều hâu Java: Loài chim biểu tượng của Indonesia. 1.374 more words

Asia

Thái Lan: Thần chim Garuda cánh vàng

https://ssangnguyen.files.wordpress.com/2015/03/produce.m4a

Đồ án hình tượng chim thần Garuda ( Phra Khrut Pha trong tiếng Thái) dang rộng đôi cánh với hành trình vạn dặm bảo vệ nhân dân, tiêu diệt yêu quái được chọn làm quốc huy chính thức của vương quốc Thái Lan bởi Vua Vajiravudh (Rama VI) kể từ năm 1911. 1.364 more words

Asia

5 things to do and see in Bali, Indonesia

You remember that first post in which I did a travel-list-type-entry and said it wasn’t my ‘thing’? Well, it’s still not. But since no one really has time to read a full-length travelogue on my recent trip to Bali*, complete with details on ‘the porcupine incident’, ‘an ugly duckling’, and ‘yelping in a public market place after being creeped out by a demon’, I have decided to succumb to necessity — nay, laziness — and do another one of these list things. 717 more words

Travel

grass-cradled (haiga)


the traveler’s gift
of one feather

Linked to Carpe Diem #684: Bird Feathers, where our host Chèvrefeuille has shared a wonderful haiga featuring a peacock – as well as this cascading haiku: 163 more words

వినత -కద్రువ

వినత -కద్రువ 

భావరాజు పద్మిని

తన  శరీరంలో పుట్టిన పుండు తన శరీరాన్నే పడగోడుతుంది, కానీ తన యందు పుట్టిన అసూయ తనతో పోదు, అది మొత్తం వంశాన్నే నాశనం చేస్తుంది.  ఎవరికి కడుపులో అసూయ ఉందో , వారు అది బయటకు చూపకపోయినా, అది లోపల రగులుకుంటుంది. భూమి లోపలకి వెళ్ళిపోతాయి పాములు, ఆకాశం లో ఎగురుతాయి పక్షులు. అధోముఖంగా(క్రిందికి, భూమిలోని బిలం లోకి ) పయనించే జీవులు , కడుపులో అసూయ ఉన్న కద్రువ కు పుట్టాయి. అమిత తేజోవంతులై ఊర్ధ్వముఖంగా (పైకి)ఆకాశగమనం చేసే పక్షులు అసూయ లేని వినతకు పుట్టాయి. ఆ కధను ఇవాళ చెప్పుకుందాము.

కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత,కద్రువులకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు.

కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యిపాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతికి బిడ్డలు కలిగారన్న ఆత్రంతో , నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతి కి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీదాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథి గా అనూరుడు వెళ్లిపోతాడు.

వినత, కద్రువ లు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీర సాగరమధనం లో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్నగుర్రమును చూసి, కద్రువ తన సవతి తో “చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంతా తెల్లగా ఉన్నా, తోక నల్లగా ఉన్నది” అని అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేద్దాము ,”తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి “, అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు.

కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో,” మాతృ వాక్యపరిపాలన చెయ్యని మీరందరు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్ప యాగంలో మరణిస్తారు”, అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు ,”అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను”, అని అంటాడు. తరువాతి రోజు వినత, కద్రువ లు వెళ్ళి చూడగానే గుఱ్ఱం తోక, కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధ పడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది.

కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుత్మంతుడు ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువువాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి,  వినయశీలి.

గరుడుడిని చూసి కద్రువ, “వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆతరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.

దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే ఏం చెయ్యాలో చెప్పమని, కద్రువను అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులతో  ఆలోచించి ,అమృతం పొందాలనే కోరికతో, “తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని”, చెబుతారు.

గరుత్మంతుడు అమిత కష్టంతో, పట్టువదలక పోరాడి, అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి “నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు. అందరికి అమరత్వం సిద్దించరాదు” అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు -ఇంద్రుడు ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు అమృతకలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భల పై ఉంచుతాడు.అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి తల్లి దాసీత్వము పోతుంది.

అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చెయ్యడానికి వెళ్తాయి. అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృతకలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది గ్రహించి సర్పాలు బాధ పడతాయి. అయినా ఆశ చావక, ఆ పాములు దర్భలపై ఉంచి నప్పుడు ఒలికిన అమృతాన్ని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలి పోతాయి. ఆవిధంగా సర్పాలకు ద్విజిహ్వత్వం (రెండు నాలుకలు) సిద్ధించింది.

 మాతృభక్తి తో , కార్యదీక్షతో  తన తల్లికి దాస్య విముక్తి కలిగించిన గరుడుని ముందు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, ‘ఏం వరం కావాలో కోరుకో’ అంటారు. “మీ వాహనంగా, ధ్వజ చిహ్నంగా నన్ను స్వీకరించి మీ సేవాభాగ్యం అనుగ్రహించండి. అలాగే నాకు అమృతం తాగకుండానే, జరామరణాలు లేకుండా అనుగ్రహించండి…” అని ప్రార్ధించాడు.

ఆ విధంగా తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోతాడు గరుడుడు. సర్వశక్తిమంతుడు అయి ఉండి, తల్లి మాటకోసం సవతిసోదరులను వీపున మోస్తూ, అవమానాలను భరించి, తల్లికీ, తనకూ కూడా ఉన్న దాస్యబంధనాలను ఛేదించుకొని ఉన్నతస్థానాన్ని పొందాడు, గరుడుడు.

నీతి : అసూయ మనిషిని నిలువెల్లా కాల్చేస్తుంది, దాన్ని వీడాలి. తల్లిదండ్రులనే దైవంగా భావించి, నమస్కరిస్తే, దైవం కూడా మనపట్ల ప్రసన్నం అవుతారు.

భావరాజు పద్మిని